10 July 2024
త్రిప్తి డిమ్రి బ్యాడ్ న్యూస్ రెమ్యునరేషన్ తెలిస్తే మైండ్ బ్లాంక్..
Rajitha Chanti
Pic credit - Instagram
డైరెక్టర్ సందీప్ దర్శకత్వంలో రణబీర్ కపూర్ నటించిన యానిమల్ సినిమాతో నేషనల్ క్రష్‌గా మారిపోయింది బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి.
ఈ మూవీలో జోయా పాత్రలో అందం, అమాయకత్వంతో ఆకట్టుకుంది. యానిమల్ తర్వాత త్రిప్తికి వరుస ఆఫర్స్ వస్తున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం హిందీలో బ్యాడ్ న్యూ్స్ సినిమాలో నటిస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ మూవీపై మరింత హైప్ పెంచాయి.
ఇందులో బీటౌన్ హీరో విక్కీ కౌశల్, అమీ విర్క్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఇప్పుడు త్రిప్తి రెమ్యునరేషన్ భారీగా పెంచేసినట్లు టాక్.
ప్రస్తుతం త్రిప్తికి ఇన్ స్టాలో 5.2 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. యానిమల్ సినిమాకు రూ.40 లక్షలు పారితోషికం తీసుకుందట త్రిప్తి డిమ్రి.
కానీ ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్ భూల్ భూలయ్యా 3 సినిమాకు ఏకంగా రూ.80 లక్షల నుంచి రూ.1 కోటి వరకు వసూలు చేస్తుందని సమాచారం.
ప్రస్తుతం త్రిప్తి నటిస్తోన్న బ్యాడ్ న్యూస్ మూవీ జూలై 19న థియేటర్లలో విడుదల కానుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ జరుగుతున్నాయి.
యానిమల్ తర్వాత త్రిప్తికి తెలుగులోనూ ఆఫర్స్ వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసేందుకు రెడీ అయ్యిందట.
ఇక్కడ క్లిక్ చేయండి.