16 ఏళ్లకే క్యాస్టింగ్ కౌచ్.. ఆపై డ్రగ్స్‌కు బానిస.. ఆ హీరోయిన్ ఎవరంటే
15 Febraury 2024
సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి ఇప్పటికే చాలా మంది చాలా సందర్భాల్లో తెలిపారు. తాజాగా ఓ హీరోయిన్ 16ఏళ్లకే క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డా అని తెలిపింది
రష్మీ అసలు పేరు శివాని దేశాయ్. గుజరాతీ కుటుంబంలో జన్మించారు. అస్సాంలో పుట్టి, చదువు పూర్తయ్యాక ముంబైకి వచ్చి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.
20 ఏళ్ల వయసులో నటన రంగంలోకి అడుగుపెట్టారు. మొదట్లో సింపుల్ లుక్ లో గ్లామరస్ గా, బోల్డ్ గా కనిపించింది రష్మీ.
రష్మీ 2021లో నందీష్ సంధును వివాహం చేసుకుంది. కొన్ని కారణాల వల్ల 2 సంవత్సరాల తర్వాత విడాకులు తీసుకున్నారు.
గజబ్ భైల్ రామ, కబ్ హోయ్ గౌనా హమర్, నదియా కే తీర్, గబ్బర్ సింగ్, దుల్హా బాబు, బంధన్ టూటే నా, పప్పు కే ప్యార్ హో గలే వంటి భోజ్‌పురి చిత్రాలలో రష్మీ నటించింది.
ఆడిషన్ సమయంలో తాను మద్యం మరియు డ్రగ్స్‌కు బానిసైనట్లు తెలిపింది. అప్పుడు తన వయసు కేవలం 16 ఏళ్ళు అని తెలిపింది.
తనను సద్వినియోగం చేసుకుని వేధించడానికి ప్రయత్నించిన వ్యక్తిని నా తల్లి చెప్పుతో కొట్టిందని రష్మీ పేర్కొంది.
బుల్లితెరపై అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటీమణుల్లో రష్మీ ఒకరు. బిగ్ బాస్ 13లో పాల్గొనేందుకు వారానికి 2.5 కోట్ల రూపాయలకు పైగా తీసుకుంది ఈ భామ.
14 ఏళ్లుగా నట ప్రపంచంలో పనిచేస్తున్న రష్మీ దేశాయ్ వద్ద 5 ఫ్లాట్లు అలాగే చాలా ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి.