ఇన్ స్టాలో ఆ ఒక్కరినే ఫాలో అవుతున్న అల్లు అర్జున్.. ఎవరంటే..
Rajitha Chanti
Pic credit - Instagram
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్‌తో తెలుగు చిత్రపరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో బన్నీని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం బన్నీకి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు చిక్కడపల్లి పోలీసులు.
అప్పటికే హైకోర్టు బన్నీకి 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కానీ ప్రొసీజర్ ఆలస్యం కావడంతో రాత్రంతా జైలులో ఉన్న బన్నీ ఉదయం రిలీజ్ అయ్యారు.
శనివారం జైలు నుంచి విడుదలైన బన్నీ ముందుగా గీతా ఆర్ట్స్ ఆఫీసుకు వెళ్లారు. అక్కడి నుంచి ఇంటికి వెళ్లిన బన్నీకి ఆప్యాయంగా స్వాగతం పలికారు కుటుంబసభ్యులు.
పుష్ప 2 సినిమాతో భారతీయ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డ్ సృష్టించారు అల్లు అర్జున్. దీంతో ప్రపంచవ్యాప్తంగా బన్నీకి భారీగా ఫాలోయింగ్ పెరిగింది.
ప్రస్తుతం అల్లు అర్జున్‌కు ఇన్ స్టాలో 28 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్ స్టాలోనే హయ్యేస్ట్ ఫాలోవర్స్ ఉండగా.. బన్నీ కేవలం ఒకరిని మాత్రమే ఫాలో అవుతున్నారు.
ఇన్ స్టాలో అల్లు అర్జున్ ఫాలో అవుతున్న ఏకైక వ్యక్తి ఎవరో కాదు.. ఆయన భార్య స్నేహరెడ్డి. ఇంకా తన స్నేహితులు, టాలీవుడ్ స్టార్లను బన్నీ ఫాలో కావడం లేదు.
మరోవైపు అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ సృష్టిస్తుంది. విడుదలైన ఆరు రోజుల్లోనే ఏకంగా రూ.1000 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది.