అల్లు అర్జున్ మొదటి పారితోషకం ఎంతో తెలుసా?
05 October 2024
Basha Shek
సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.
ఇప్పుడు పుష్ప 2 సినిమా కోసం రెడీ అవుతున్నాడీ టాలీవుడ్ స్టార్ హీరో. డిసెంబర్ 06న ఈసినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
అయితే ‘పుష్ప 2′ విడుదలకు ముందే అల్లు అర్జున్ తన పారితోషికాన్ని రూ.150 కోట్లకు పెంచుకున్నట్లు నెట్టింట టాక్ వినిపిస్తోంది.
ప్పటి వరకు దాదాపు రూ. 100 కోట్ల రూపాయలు పారితోషికం అందుకున్న బన్నీ. ఇప్పుడు 150 కోట్లు డిమాండ్ చేస్తున్నాడని తెలుస్తోంది.
కాగా హీరోగా ఎంట్రీ ఇవ్వక ముందు మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన డాడీ సినిమాలో చిన్న రోల్ లో కనిపించాడు అల్లు అర్జున్.
డాడీ సినిమాలో అల్లు అర్జున్ చేసిన డాన్స్ చూసి ఫిదా అయిన రాఘవేంద్రరావు అతనికి వందరూపాయిలు ఇచ్చారట.
అల్లు అర్జన్ అందుకున్నమొదటి రెమ్యునరేషన్ ఇదేనని అతనే పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు.
రాఘవేంద్ర రావు చేతుల మీదుగా అందుకున్న వందరూపాయిలను ఇప్పటికి పదిలంగా దాచుకున్నాడట బన్నీ.
ఇక్కడ క్లిక్ చేయండి..