29 October 2025

అందాలు ఫుల్లు.. ఆఫర్స్ నిల్లు.. అదితి రావు హైదరీ ఆస్తులు ఎంతో తెలుసా

Rajitha Chanti

Pic credit - Instagram

పాన్ ఇండియా సినిమా ప్రపంచంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. తక్కువ సమయంలోనే అద్భుతమైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ వయ్యారి.

ప్రస్తుతం ఆమె వయసు 47 సంవత్సరాలు. కొన్నాళ్ల క్రితం కోలీవుడ్ హీరో సిద్ధార్థ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇంతకీ అదితి ఆస్తులు ఎంత ఉన్నాయో తెలుసా.. ?

2006లో మలయాళ చిత్రం ప్రజాపతి ద్వారా ఆమె తన నటనా ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత హిందీలో ఎక్కువగా అవకాశాలు అందుకుంది ఈ బ్యూటీ.

తెలుగు, తమిళం, హిందీ భాషలలో అనేక చిత్రాల్లో నటించింది. కానీ ఆమెకు తెలుగులో ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. కానీ తమిళంలో మంచి క్రేజ్ వచ్చింది.

అదితి 2002లో సత్యదీప్ మిశ్రాను వివాహం చేసుకుంది. 11 సంవత్సరాలకే వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత సినిమాలపై ఫోకస్ చేసింది.

కొన్నాళ్లపాటు హీరో సిద్ధార్థ్ తో ప్రేమలో ఉన్న ఆమె.. చివరకు పెద్దల సమక్షంలో సిద్ధార్థ్ తో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. ఇంతకీ అదితి ఆస్తులు ఎంత తెలుసా..

నివేదికల ప్రకారం అదితి ఆస్తులు రూ.70 కోట్లు ఉన్నట్లు సమాచారం. ఆమె ఒక్కో సినిమాకు రూ.1 కోటి పారితోషికం తీసుకుంటుంది. అలాగే అనేక యాడ్స్ చేస్తుంది. 

సిద్ధార్థ్, అధితి ఆస్తులను కలిపితే మొత్తం రూ.140 కోట్లు వరకు ఉన్నాయని సమాచారం. అలాగే రియల్ ఎస్టేట్, ఆర్ట్ వర్క్, బ్రాండ్స్ వంటి వాటిలో పెట్టుబడులు పెట్టింది.