07 June 2025

ఆ హీరోయిన్ వయసు 19.. హీరో ఏజ్ 31.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా.. 

Rajitha Chanti

Pic credit - Instagram

ప్రేమకు వయసుతో సంబంధం లేదు. ఆకర్షించే వయసులో అర్థం చేసుకునే ప్రేమ దొరకడం చాలా అరుదు. కానీ కొన్ని ప్రేమకథలకు వయసు అడ్డురాదు. 

ఇండస్ట్రీలో హీరోయిన్‏గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ కెరీర్ తొలినాళ్లల్లోనే ఓ స్టార్ హీరోతో ప్రేమలో పడిపోయి.. అతడినే పెళ్లి చేసుకుంది. 

ఆమెకు 19 ఏళ్ల వయసు ఉన్నప్పుడే 31 సంవత్సరాల వయసున్న హీరోను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఆ ఇద్దరూ ఇండస్ట్రీలో తోపు యాక్టర్స్. 

ఆ ఇద్దరు మరెవరో కాదు.. మలయాళీ బ్యూటీఫుల్ కపుల్ నజ్రీయా నజీమ్, ఫహద్ ఫాజిల్. వీరిద్దరూ తెలుగు, తమిళం, మలయాళం భాషలలో నటించారు. 

నజ్రీయా 1994 డిసెంబర్ 20న తిరువనంతపురంలో నసీముద్దీన్, బెకంపినా దంపతులకు జన్మించింది. చైల్డ్ ఆర్టిస్టుగా సినీరంగంలోకి అడుగుపెట్టింది ఈ బ్యూటీ. 

2013లో మట్ దత్ సినిమాతో కథానాయికగా మలయాళీ చిత్రపరిశ్రమలోకి అరంగేట్రం చేసింది. ఆ తర్వాత తమిళంలో రాజా రాణి సినిమాతో హిట్టుకొట్టింది. 

2014లో బెంగుళూరు డేస్ చిత్రంతో మరింత పాపులర్ అయ్యింది నజ్రియా. ఇందులో నజ్రియా భర్తగా మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ నటించారు.

ఈ సినిమాతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. 2014 ఆగస్ట్ 21 పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక పాప ఉన్నారు.