తెలుగులో 3 సినిమాలు.. 33 కోట్ల ఆస్తులు.. దెబ్బకు కనిపించకుండా పోయింది
Rajitha Chanti
Pic credit - Instagram
ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేని ఓ సాధారణ అమ్మాయి నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టింది. టీవీ సీరియల్స్ ద్వారా కెరీర్ ప్రారంభించింది ఈ ముద్దుగుమ్మ.
ఆ తర్వాత హిందీలో వరుస అవకాశాలు అందుకుంటూ కథానాయికగా మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. తెలుగులో చేసిన ఫస్ట్ మూవీతోనే భారీ విజయాన్ని అందుకుంది.
ఆ సినిమా తర్వాత తెలుగులో మరో ఆఫర్ అందుకున్న ఈ వయ్యారి.. టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా 3 సినిమాల్లో నటించి తనకంటూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.
ఆమె మరెవరో కాదండి.. హీరోయిన్ మృణాల్ ఠాకూర్. సీతారామం సినిమాతో తెలుగు సినీరంగంలోకి అరంగేట్రం చేసింది. ఆ తర్వాత హాయ్ నాన్నలో కనిపించింది.
తెలుగులో సీతారామం, హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మకు నటిగా మంచి మార్కులు వచ్చిన్పపటికీ ఆఫర్స్ మాత్రం రాలేదు.
దీంతో కొన్ని నెలలుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో సైలెంట్ అయ్యింది మృణాల్. అటు హిందీతోపాటు ఇటు తెలుగులోనూ ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది ఈ వయ్యారి.
ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న మృణాల్.. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు పంచుకున్న ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి.
ఇదిలా ఉంటే.. మృణాల్ ఆస్తులు రూ.33 కోట్లకు పైగానే ఉన్నాయట. అలాగే ఆమె వద్ద రూ.30 లక్షల విలువైన టయోటా ఫార్చ్యునర్, హోండా అకార్డ్స్ కార్లు ఉన్నాయట.