02 November 2025

సినిమాలు లేకపోయినా తగ్గని రేంజ్.. అమలా పాల్ ఆస్తులు ఎంతంటే..

Rajitha Chanti

Pic credit - Instagram

దక్షిణాది సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని హీరోయిన్ అమలా పాల్. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తనదైన ముద్ర వేసింది.

సింధు సమవేలి సినిమాతో కథానాయికగా తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అమలాపాల్.. ఆ తర్వాత మైనా సినిమాతో సౌత్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

దాదాపు 12 సంవత్సరాలకు పైగా తమిళం, మలయాళం, తెలుగు చిత్రాల్లో నటిస్తూ మెప్పిస్తుంది. 2014లో డైరెక్టర్ ఏఎల్ విజయ్ ను పెళ్లి చేసుకోగా.. 2017లో విడాకులు తీసుకున్నారు.

 ఆ తర్వాత కొన్నాళ్లు ఒంటరిగా ఉన్న అమలా పాల్ తన స్నేహితుడు జగత్ దేశాయ్ ను 2023 నవంబర్ లో కేరళలోని కొచ్చిలో కుటుంబాల మధ్య వివాహం చేసుకున్నారు.

వీరికి బాబు జన్మించారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న అమలా పాల్.. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంటుంది. 

ఇదిలా ఉంటే..నివేదికల ప్రకారం అమలా పాల్ ఆస్తులు రూ.40 కోట్లు ఉన్నట్లు సమాచారం. ఆమెకు కేరళలో విలాసవంతమైన బంగ్లా ఉందని నెట్టింట టాక్ నడుస్తోంది.

అమలా పాల్, జగత్ దేశాయ్ మొత్తం ఆస్తులు కలిపితే దాదాపు రూ.60 కోట్లు ఉన్నాయని టాక్. అమలా పాల్ తెలుగులో ఇద్దరమ్మాయిలతో సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

అలాగే రామ్ చరణ్ సరసన నాయక్ చిత్రంలోనూ కనిపించింది. అయితే అందం, అభినయంతో కట్టిపడేసినప్పటికీ ఈ బ్యూటీకి టాలీవుడ్ లో అంతగా అవకాశాలు మాత్రం రాలేదు.