TV9 Telugu
29 february 2024
లీప్ ఇయర్ లో పుట్టిన ఏకైక టాలీవుడ్ హీరో ఇతనే.!
ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి సంవత్సరం బర్త్ డే చాలా స్పెషల్. కానీ లీప్ ఇయర్.. ఫిబ్రవరి 29న పుట్టినరోజు వాళ్లు కూడా ఉంటారు.
అంటే ప్రతి ఏడాది కాకుండా నాలుగేళ్లకు ఒకసారి వచ్చే ఫిబ్రవరి 29న పుట్టినరోజు వేడుకలను ఎంతో ప్రత్యేకంగా జరుపుకుంటారు.
మీకు తెలుసా.? ఈరోజు లీప్ ఇయర్ లో ఓ టాలీవుడ్ హీరో బర్త్ డే ఉంది. లీప్ ఇయర్లో పుట్టిన ఏకైక తెలుగు హీరో అతనే .
నాలుగేళ్లకు ఒకసారి బర్త్ డే జరుపుకుంటున్న ఆ హీరోకి నెట్టింట ఫ్యాన్స్, ఫ్రెండ్స్ స్పెషల్ బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు.
ఇంతకీ ఆ హీరో ఎవరు అనుకుంటున్నారా.? టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ , ఫామిలీ మాన్ లా కనిపించే హీరో శ్రీవిష్ణు.
ఈరోజు పక్కింటి కుర్రాడిలా ఉండే శ్రీ విష్ణు బర్త్ డే. ఈ సందర్భంగా ఆయన సినిమా అప్డేట్స్ షేర్ చేస్తున్నారు మేకర్స్.
శ్రీవిష్ణు.. హీరోయిజం కాకుండా కంటెంట్ ప్రాధాన్యత చూస్తు వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు.
1984లో పుట్టిన శ్రీవిష్ణు నేటితో 40వ వసంతంలోకి అడుగుపెట్టాడు. నాలుగేళ్లకు ఒకసారి వచ్చే బర్త్ డేను మరింత ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి