ప్రభాస్ లగ్జరీ కార్ కలెక్షన్ చూస్తే మెంటలెక్కిపోద్ది బాసూ..
Rajitha Chanti
Pic credit - Instagram
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. త్వరలోనే రాజాసాబ్ సినిమాతో అడియన్స్ ముందుకు రానున్నారు.
అలాగే భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుడిగా రికార్డ్ సృష్టించారు. కానీ మీకు తెలుసా.. ప్రభాస్ సైతం ఆటోమొబైల్స్ పట్ల విపరీతమైన ఆసక్తి ఉందట.
ప్రభాస్ వద్ద లంబోర్గిని అవెంటడార్ నుండి రోల్స్ రాయిస్ ఫాంటమ్ వరకు లగ్జరీ కార్లు ఉన్నాయి. ఇంతకీ ప్రభాస్ వద్ద ఉన్న కార్ కలెక్షన్ ఏంటో చూద్దామా.
ప్రభాస్ వద్ద ఇటాలియన్ థొరోబ్రెడ్ లంబోర్గిని అవెంటడోర్ కారు ఉంది. ఈ లగ్జరీ కారు ధర దాదాపు రూ.6 కోట్లు వరకు ఉంటుందని సమాచారం.
అలాగే రోల్స్ రాయిస్ ఫాంటమ్ (రూ. 8 - 10 కోట్లు), రేంజ్ రోవర్ (రూ. 3 కోట్లు), జాగ్వార్ XJR (రూ. 2 కోట్లు), BMW X3 (రూ. 60 – 70 లక్షలు) ఉన్నాయి.
నివేదికల ప్రకారం ప్రభాస్ ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.150 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు టాక్. ఇప్పుడు అరడజనుకుపైగా చిత్రాల్లో నటిస్తున్నారు.
రాజాసాబ్ సినిమాతోపాటు డైరెక్టర్ హను రాఘవపుడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. త్వరలోనే సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించే స్పిరిట్ పట్టాలెక్కనుంది.
ఇవే కాకుండా ఇప్పటికే సూపర్ హిట్స్ అయిన సలార్, కల్కి 2898 ఏడీ చిత్రాల సీక్వెల్స్ చేయనున్నాడు. ఇవే కాకుండా మరిన్ని ప్రాజెక్ట్స్ స్క్రిప్ట్ రెడీ అవుతున్నాయి.