దేవర భార్య గురించి తెలుసా?

TV9 Telugu

24 March 2024

జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న సినిమా దేవర. ఈ సినిమాలో ఆయనకు భార్యగా ఎవరు నటిస్తున్నారో తెలుసా? ఆమె పేరు శ్రుతి మరాఠీ.

ఈ బ్యూటీ నేటివ్‌ ప్లేస్‌ గుజరాత్‌ రాష్ట్రం. మోడల్‌గా గ్లామర్‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు శ్రుతి మరాఠీ.

ఆ తర్వాత 2008లో ఓ మరాఠీ సినిమాతో నటిగా వెండితెరకు పరిచయమయ్యారు ఈ వయ్యారి భామ శృతి. ఈ చిత్రం ఆకట్టుకుంది.

అదే ఏడాది ఇందిర విళా అనే తమిళ్‌ సినిమాలోనూ నటించారు. ఆ సినిమాలో హేమ మాలిని అనే స్క్రీన్‌ నేమ్‌తో చేశారు శ్రుతి.

ఆ తర్వాత కూడా తమిళం, మరాఠీ, హిందీ, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తూ ఆర్టిస్ట్ గా కంటిన్యూ అయ్యారు ఈ బ్యూటీ.

తెలుగులో మాత్రం ఆమెకు ఇదే తొలి సినిమా. ఫస్ట్ సినిమాలోనే జూనియర్‌ ఎన్టీఆర్‌ భార్యగా నటించడం ఆనందంగా ఉందని అంటున్నారు శ్రుతి.

రియల్‌ లైఫ్లో ఈమెకు ఆల్రెడీ పెళ్లయింది. గౌరవ్‌ ఘట్నేకర్‌ని 2016లోనే వివాహం చేసుకున్నారు శ్రుతి మరాఠీ.

దేవర రెండు పార్టులుగా తెరకెక్కుతోంది. మరి ఈమె పోర్షన్‌ సెకండ్ పార్టులో ఉంటుందా? లేదా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.