20 May 2025

ఇండస్ట్రీలో సైలెంట్ అయిన రాధిక.. ఏమైందంటోన్న ఫ్యాన్స్.. 

Rajitha Chanti

Pic credit - Instagram

డీజే టిల్లు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది సెన్సేషన్ అయ్యింది నేహా శెట్టి. రాధిక పాత్రలో అటు కుర్రకారు గుండెల్లో ముద్ర వేసుకుంది ఈ ముద్దుగుమ్మ. 

2015లో మిస్ సౌత్ ఇండియా రన్నరప్ అయిన ఈ అమ్మడు.. 2016లో ముంగారు మాలే 2 సినిమాతో కథానాయికగా సౌత్ ఇండస్ట్రీకి పరిచయమైంది. 

తొలి సినిమా మిశ్రమ స్పందన రాగా.. అందం, అభినయంతో ప్రశంసలు అందుకుంది. 2018లో పూరీ డైరెక్షన్ లో వచ్చిన మెహబూబా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. 

ఈ సినిమా అంతగా మెప్పించలేకపోయింది. ఆ తర్వాత 2021లో గల్లీ రౌడీ సినిమాతో మరోసారి టాలీవుడ్ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చింది ఈ వయ్యారి.

ఆ తర్వాత 2022లో వచ్చిన డీజే టిల్లు సినిమాతో సరైన బ్రేక్ అందుకుంది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో రాధిక పాత్రతో క్రేజ్ వచ్చేసింది. 

ఈ సినిమాలో రాధిక పాత్రతో కుర్రకారు హృదయాలను దొచేసింది. ఆ తర్వాత బెదురులంక 2012, రూల్స్ రంజన్, టిల్లు స్క్వేర్ చిత్రాల్లో నటించి మెప్పించింది. 

చివరగా విశ్వక్ సేన్ సరసన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో పలకరించింది ఈ అమ్మడు. ఈ సినిమాకు అంతగా రెస్పాన్స్ రాలేదు. ఆ తర్వాత మరో సినిమాను ప్రకటించలేదు. 

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో అలరించిన నేహా శెట్టి ఇప్పటివరకు మరో సినిమా ప్రకటించకపోవడం గమనార్హం. అటు సోషల్ మీడియాలోనూ సైలెంట్ అయ్యింది.