25 June 2025
ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీని షేక్ చేసింది.. ఆ హీరోతో లవ్ రూమర్స్..
Rajitha Chanti
Pic credit - Instagram
అందంగా లేదంటూ కాలేజీలో బాడీ షేమింగ్ కామెంట్స్ ఎదుర్కొంది. కానీ ఇన్ స్టాలో షేర్ చేసిన ఒక్క ఫోటోతో ఇప్పుడు గ్లామర్ ప్రపంచాన్ని ఏలేస్తుంది ఈ హీరోయిన్.
ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీని శాసించింది ఈ ముద్దుగుమ్మ. కానీ ఓ యంగ్ హీరోతో ప్రేమంటూ నిత్యం ఎన్నో రూమర్స్ సోషల్ మీడియాలో హల్చల్ అయ్యాయి.
అయితే తాము ప్రేమలో లేమంటూ ఎన్నోసార్లు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది ఈ వయ్యారి. అయినప్పటికీ వీరిద్దరి గురించి నిత్యం ఏదోక వార్త వినిపిస్తుంది.
ఇంతకీ ఈ అమ్మడు ఎవరో తెలుసా.. ? ప్రసుతం సుడిగాలి సుధీర్ సరసన గోట్ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న కన్నడ బ్యూటీ దివ్యభారతి.
తమిళంలో మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ సరసన బ్యాచిలర్ చిత్రంలో నటించింది. మొదటి సినిమాతోనే అందం, అభినయంతో సెన్సేషన్ అయ్యింది ఈ వయ్యారి.
ఇక ఆ తర్వాత జీవీ ప్రకాష్, దివ్య భారతి ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం తెరపైకి వచ్చింది. తమిళంలో ఇప్పటివరకు నాలుగైదు చిత్రాల్లో నటించింది ఈ బ్యూటీ.
అలాగే ఇప్పుడిప్పుడే తెలుగులోనూ ఆఫర్స్ అందుకుంటుంది. అలాగే తమిళంలోనూ రాణిస్తుంది. ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడు ఫాలోయింగ్ చూస్తే షాకవ్వాల్సిందే.
ప్రస్తుతం ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంది. ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ నెటిజన్లను కట్టిపడేస్తున్నాయి.