15 June 2024

ఈ అమ్మాయి ఇప్పుడు గ్లామర్ అటామ్ బాంబ్.. ఎవరో తెలుసా..? 

Rajitha Chanti

Pic credit - Instagram

సోషల్ మీడియాలో ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరోయిన్ రేర్ ఫోటో వైరలవుతుంది. ఆ అమ్మాయి మరెవరో కాదు.. హీరోయిన్ దివ్య భారతి. 

తమిళనాడులోని కోయంబత్తూరులో జన్మించిన దివ్యభారతిగా నటిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. బ్యాచిలర్ సినిమాలో నటించింది. 

తమిళంలో జీవీ ప్రకాష్ నటించిన బ్యాచిలర్ సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీలోకి ఈ బ్యూటీకి మంచి క్రేజ్ వచ్చింది. ఫాలోయింగ్ ఎక్కువే ఉంటుంది. 

ఆ తర్వాత తమిళంలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‏గా ఉంటూ ఫోటోస్ షేర్ చేస్తుంది. 

2022లో షీ బ్యూటీ అవార్డ్ వేడుకలో సెన్సేషనల్ స్టార్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ అందుకుంది. అలాగే బిహైండ్‌వుడ్స్ గోల్డ్ మెడల్స్ అవార్డ్స్ అందుకుంది. 

ఇంకా ఎన్నో అవార్డ్స్ అందుకున్న దివ్యభారతి.. ఇప్పుడు విజయ్ సేతుపతి హీరోగా నటించిన మహారాజా సినిమాలో మెయిన్ లీడ్ పోషించింది. 

 జబర్దస్త్ ఫేమ్ సుడిగాలి సుధీర్ సరసన GOAT (గ్రేటెస్ట్ ఆఫ్ అల్ టైం) అనే చిత్రంలో నటిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. 

తాజాగా తన ఇన్ స్టా ఖాతాలో దివ్యభారతి షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి. అలాగే తెలుగులో మరిన్ని ఆఫర్స్ అందుకోవడం ఖాయంగా తెలుస్తోంది.