ఆ హంస కూడా ప్రేమలో పడదా ఈ వయ్యారి సొగసు చూసి..
TV9 Telugu
18 April 2024
15 మార్చి 1996న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఓ హిందూ కుటుంబంలో జన్మించింది వయ్యారి భామ దివి వడ్త్యా.
ఈ ముద్దుగుమ్మ తండ్రి పేరు శశికాంత్ వడ్త్యా, తల్లి పేరు దేవకీ వడ్త్యా. ఈమెకి కిషోర్ వడ్త్యా అనే సోదరుడు కూడా ఉన్నాడు.
హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ లో పాఠశాల విద్యను అభ్యసించింది ఈ అందాల తార.
జి. నారాయణమ్మ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్స్ డిగ్రీ పట్టా పొందింది.
2017లో మోడల్‌గా కెరీర్ ప్రారంభించింది. అనేక స్థానిక బ్రాండ్‌ల ప్రింట్ షూట్‌లలో కనిపించింది ఈ వయ్యారి.
2019లో మహేష్ బాబు, పూజ హెగ్డే జంటగా వచ్చిన “మహర్షి” సినిమాతో తన యాక్షన్ కెరీర్ ప్రారంభించింది ఈ బ్యూటీ.
2020లో ప్రముఖ రియాలిటీ షో “బిగ్ బాస్ తెలుగు 4”లో కంటెస్టెంట్ గా పాల్గొంది. ఈ షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
దివి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మూడు భాషల్లోనూ సులభంగా మాట్లాడగలదు. 2018లో “టింగరబుచ్చి” అనే పేరుతో తన యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించింది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి