కల్కి నుంచి క్రేజీ క్లిక్స్..

TV9 Telugu

07 April 2024

ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో వస్తున్న ఇండియన్ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ సినిమా కల్కి 2898 ఏడి.

ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇందులో దీపికా పదుకొనే హీరోయిన్. దిశా పటాని కూడా ఓ పాత్రలో నటిస్తున్నారు.

అశ్వత్థామగా బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, కాళీగా కోలీవుడ్ స్టార్ కమల్ హాసన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

వైజయంతి మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అశ్విని దత్.

సంతోష్ నారాయణన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. మే 13న విడుదల కానుంది. అయితే ఎన్నికల కారణంగా వాయిదా పడే అవకాశం ఉంది.

తాజాగా కల్కి చిత్ర లొకేషన్స్ నుంచి ఓ ఫోటోను విడుదల చేసారు పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, దిశా పటానీ.

రెబల్ స్టార్‌తో దిగిన సెల్ఫీని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ దిశా పటానీ.

ఈ ఫొటోలకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ చేస్తున్నారు డార్లింగ్ అభిమానులు.