TV9 Telugu
ఎవరేమనుకుంటే నాకేంటి? దిశా పటాని..
03 March 2024
ఎవరేమనుకున్నా తను పట్టించుకోదలచుకోవడం లేదనంది బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న దిశా పటాని.
ఇంతకీ ఏ విషయంలో అని ఆరా తీస్తే.. బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ పేరును ప్రస్తావించింది ఈ బ్యూటీ.
ఇవాళ తను నటిగా, ఈ స్థాయిలో ఉండటానికి కారణం నిర్మాత కరణ్ జోహారేనని వెల్లడించింది హీరోయిన్ దిశా పటాని.
తను 18 ఏళ్ల వయసులో సినిమాలకు ముందు మోడలింగ్ చేసుకుంటున్నప్పుడు, కరణ్ నన్ను గుర్తించారని తెలిపింది.
మోడలింగ్ చేసుకుంటున్న సమయంలో, కరణ్ జోహార్ తనను పిలిచి సినిమా అవకాశం ఇచ్చారని గుర్తుచేసుకొంది ఈ భామ.
తను సినిమా ఇండస్ట్రీకి ఔట్‌సైడర్‌నైనా మోడలింగ్ చేసుకుంటున్న సమయంలో, కరణ్ తనను పిలిచి అవకాశం ఇచ్చారని గుర్తుచేసుకొంది.
నెపోటిజంతో ముడిపెడుతూ బాలీవుడ్‌లో తరచూ కరణ్‌జోహార్ పేరు వైరల్ అవుతుంది. అలాంటివారి గురించి తాను పట్టించుకోనని చెప్పింది.
ప్రస్తుతం ఆమె నటిస్తున్న యోధ విడుదలకు సిద్ధమైంది. సౌత్‌లో ప్రభాస్‌తో కల్కి 2898 ఏడీ, సూర్యతో కంగువలో నటిస్తుంది దిశా.
ఇక్కడ క్లిక్ చెయ్యండి