దళపతి ఆఖరి సినిమా అదేనా.? ఎవరిష్టం వాళ్లది అంటున్న రష్మిక.!

TV9 Telugu

04 February  2024

కోలీవుడ్ హీరో దళపతి విజయ్‌ చేస్తున్న చివరి సినిమా డైరక్టర్‌ ఎవరనే విషయం మీద ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

ప్రస్తుతం వెంకట్‌ ప్రభు డైరక్షన్‌లో గ్రేటెస్ట్ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌ సినిమాలో డ్యూయల్‌ రోల్‌ చేస్తున్నారు విజయ్‌.

ఈ సినిమా తర్వాత మరో సినిమా కమిట్‌ అయ్యానని తన పొలిటికల్‌ నోట్‌లో హింట్‌ ఇచ్చారు స్టార్ హీరో విజయ్ దళపతి.

ఆ చిత్రానికి కార్తిక్‌ సుబ్బరాజ్‌ డైరక్షన్‌ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే విజయ్‌ ఆఖరి సినిమాను బంపర్‌ హిట్‌ చేయాల్సిన బాధ్యత కార్తిక్‌దే!

అందరూ ఒకే రకంగా ఆలోచించాలని, ఒక అంశాన్ని ఒకే రకంగా చూడాలని మనం అనుకోకూడదని అంటుంది రష్మిక మందన్న.

రీసెంట్‌గా ఆమె నటించిన యానిమల్‌ మూవీ... హిందీ హయ్యస్ట్ గ్రాసర్‌ సినిమాల్లో ఒకటిగా స్థానం సంపాదించుకుంది.

యానిమల్ సినిమా కంటెంట్‌ మీద ప్రేక్షకుల్లో మిక్స్డ్ ఒపీనియన్స్ రావడం గురించి హీరోయిన్ రష్మిక మందన్న మాట్లాడింది.

మెజారిటీ ప్రజల అభిప్రాయం ఏంటన్నదాన్నే తాను కన్సిడర్‌ చేస్తానని తెలిపింది నేషనల్ క్రష్ రష్మిక మందన్న.