TV9 Telugu
మరోసారి గ్లోబల్ రేంజ్ లో చరణ్ సత్తా..
03 March 2024
ట్రిపుల్ ఆర్ భారీ బ్లాక్ బస్టర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రేంజ్ ఎలా పెరిగిందో అందరికీ తెలుసు.
తాజాగా హాలీవుడ్‌లో నటీనటుల ఎంపిక సంస్థ ఒకటి తమకి ఈ లక్షణాలు ఉన్న నటుడు కావాలని కొన్ని పాయింట్స్ పెట్టారు.
అందులో హాలీవుడ్ స్టార్స్ ఆస్కార్ ఇసాక్, టెనెట్ నటుడు జాన్ డేవిడ్ వాషింగ్టన్, టాప్ గన్ నటుడు మైల్స్ టెల్లర్ లాంటి నటులను రిఫెరెన్సుగా చూపించారు.
వాళ్లతో పాటు RRRలో రామ్ చరణ్ నటించిన పోలీస్ గెటప్ లుక్ కూడా ఆ పాయింట్స్ లో పొందుపరిచారు సంస్థ అధికారులు.
ఈ ఫిజిక్ ఉన్న నటులు కావాలంటూ యాడ్ ఇచ్చారు. దాంతో చరణ్ గ్లోబల్ రేంజ్ మరోసారి బయటికి వచ్చిందంటూ పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్.
ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్ చెంజర్ చిత్రంలో నటిస్తున్నారు.
చెర్రీకి జోడిగా కియారా అద్వానీ నటిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 25 క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
బుచ్చిబాబుతో ఓ సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో గౌతమ్ తిన్ననూరితో ఓ మూవీ చేస్తున్నట్లు సమాచారం.
ఇక్కడ క్లిక్ చెయ్యండి