రాజమౌళి రేంజ్ కి చేరుకోవడం ఆ దర్శకులకు సాధ్యమేనా..

08 November 2023

బాహుబలి, ట్రిపుల్‌ ఆర్‌ లాంటి సినిమాలతో సౌత్‌లోనే కాదు. నార్త్ ఆడియన్స్ ని కూడా తన వైపు తిప్పుకున్నారు రాజమౌళి.

త్వరలోనే మహేష్‌ మూవీతో మరోసారి సత్తా చాటడానికి రెడీ అవుతున్నారు. ఆయన వేసిన రూట్లో నార్త్ ని కొల్లగొట్టడానికి రెడీ అవుతున్నారు చాలా మంది సౌత్‌ మేకర్స్.

రీసెంట్‌గా జవాన్‌తో తన సత్తా చూపించారు అట్లీ. జవాన్‌ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అని పేరు తెచ్చుకున్నా, క్రెడిట్‌లో మేజర్‌ పార్టు కింగ్‌ఖాన్‌ కొట్టేశారు.

యంగ్‌స్టర్స్ లో లోకేష్‌ కనగరాజ్‌ రాజమౌళిని దాటేస్తారనే టాక్‌ ఆ మధ్య బాగానే వినిపించింది. విక్రమ్‌తో మాంఛి హైప్‌ క్రియేట్‌ చేసిన లోకేష్‌.

రీసెంట్‌గా లియోతో కాస్త డల్‌ అయ్యారు. విక్రమ్‌ టైమ్‌లో వినిపించినంతగా, లియో రిలీజ్‌ టైమ్‌లో లోకేష్‌ పేరు పాపులర్‌ కాలేదన్నదే వాస్తవం.

ఆల్రెడీ కేజీయఫ్‌తో నార్త్ లో సత్తా చూపించిన ప్రశాంత్‌ నీల్‌ ఇప్పుడు సలార్‌తో దాన్ని కంటిన్యూ చేస్తే మాత్రం తప్పకుండా గేమ్‌లో ఇంకో స్టెప్‌ ముందుకేసినట్టే.

ప్రశాంత్‌ ఆ మందడుగు వేస్తారా? లేదా? అనే ఆసక్తి జనాల్లోనూ మెండుగా కనిపిస్తోంది. ప్రభాస్ తో ఇది కచ్చితం సాధ్యం అనిపిస్తుతుంది.

ఎప్పటినుంచో రాజమౌళి పనితీరును ప్రశంసిస్తున్న స్టార్‌ డైరక్టర్‌ మణిరత్నం తెరకెక్కిస్తున్న థగ్‌ లైఫ్‌ మరో రేంజ్‌లో ఉంటుందని అంటున్నారు.