బొమ్మ బ్లాక్‌బస్టర్ అయితే డైరెక్టర్లను గిఫ్టులతో ముంచేస్తూ ఖుషీ చేయిస్తున్నారు నిర్మాతలు. ఈ మధ్య గిఫ్ట్ ట్రెండ్ ఎక్కువైపోయింది.
హిట్ సినిమాలు తీసిన దర్శకుల పంట పండుతుంది. నిర్మాతలు ఫుల్ ఖుషీ అయిపోయి.. వాళ్లకు ఖరీదైన బహుమతులిచ్చి మతులు పోగొడుతున్నారు.
తాజాగా బేబీ దర్శకుడు సాయి రాజేష్‌కు బెంజ్ కార్ గిఫ్ట్ ఇచ్చారు నిర్మాత SKN. రిలీజ్‌కు ముందే ఆయనకు కార్ ఇచ్చినా.. సక్సెస్ అవడంతో ఇప్పుడు ఇంకాస్త కాస్ట్ లీ కార్ ఇచ్చారు SKN.
జైలర్‌తో సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ ఇచ్చిన నెల్సన్ దిలీప్ కుమార్‌కు కోటి రూపాయల కార్ గిఫ్టుగా ఇచ్చారు నిర్మాత కళానిధి మారన్.
అంతటితో ఆగకుండా జైలర్ 2 కోసం ఏకంగా 55 కోట్లు అడ్వాన్స్‌గా ఇచ్చి సంచలనం రేపాయి. రజినీకాంత్‌కు 100 కోట్లు అదనంగా ఇచ్చారు.
అనిరుధ్‌కు సైతం కాస్ట్ లీ కార్డ్ ఇచ్చారు మారన్. అలాగే ఆ మధ్య విరూపాక్ష హిట్టైనందుకు కార్తిక్ దండుకు కార్ ఇచ్చారు సుకుమార్.
దర్శకులకు గిఫ్టులు ఇచ్చే ట్రెండ్ చాలా ఏళ్ళ కిందే మొదలైంది. టెంపర్ టైమ్‌లో పూరీ వర్క్ నచ్చి.. ఆయనకు గోల్డ్ లైటర్ గిఫ్ట్‌గా ఇచ్చారు బండ్ల గణేష్.
ఆ తర్వాత శ్రీమంతుడు టైమ్‌లో కొరటాలకు కార్ ఇచ్చారు మహేష్.. ఇక జనతా గ్యారేజ్ సక్సెస్‌తో ఆయనకు విల్లా ఇప్పించారు ఎన్టీఆర్.
భీష్మ సక్సెస్‌తో వెంకీ కుడుములకు కార్ ఇచ్చారు నితిన్. ఇలా ఈ మధ్య దర్శకులను బహుమతులతో తడిపేస్తున్నారు.