విలేజ్ బ్యాక్‌డ్రాప్ కథలకే ఆడియన్స్ పట్టం.. అదే ట్రెండ్‎లో కెప్టెన్స్..  

12 November 2024

Battula Prudvi

తెలుగులో విలేజ్ బ్యాక్‌డ్రాప్ కథలే ట్రెండ్ అవుతున్నాయి. కొన్నేళ్లుగా బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తున్న విలేజ్ వండర్స్‌పైనే.

ఇండస్ట్రీలో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ నడుస్తుంటుంది. కొన్నేళ్లు ఫ్యామిలీ సబ్జెక్ట్స్.. కొన్నేళ్లు ఫ్యాక్షన్.. ఇంకొన్నేళ్లు రొమాన్స్.. ఇంకొన్నేళ్లు విజువల్ వండర్స్..

ఎప్పటికప్పుడు ఆడియన్స్ టేస్టుకు తగ్గట్లుగా తమను తాము అప్‌డేట్ చేసుకుంటూ ఉంటారు దర్శకులు. ఇప్పుడు విలేజ్ బ్యాక్‌డ్రాప్ కథలకు డిమాండ్ పెరిగింది.

ఈ మధ్య కాలంలో తెలుగులో వచ్చిన చాలా విజయాలు గ్రామీణ నేపథ్యమున్న కథలే. వీటిని ఆడియన్స్ బాగా ఆదరిస్తున్నారు.

కాస్త ఎంటర్‌టైన్మెంట్.. ఇంకాస్త సస్పెన్స్ జోడించి రాసుకున్న విలేజ్ బ్యాక్‌డ్రాప్ కథలు బాగా సక్సెస్ అవుతున్నాయి. దానికి క సినిమానే లేటెస్ట్ ఎగ్జాంపుల్.

ఈ ట్రెండ్ ఏడేళ్ళ కింద రామ్ చరణ్ హీరోగా రంగస్థలంతో సుకుమార్ మొదలు పెట్టారు. అదే దర్శకులంతా ఫాలో అవుతున్నారు.

గ్రామీణ నేపథ్యం ఉన్న కథలకు అంతగా కనెక్ట్ అవ్వడానికి మరో కారణం కూడా లేకపోలేదు. నేటి జనరేషన్‌కు ఊళ్లు, అక్కడి సంప్రదాయాలపై అంతగా పట్టులేదు..

దాన్ని సినిమాల్లో చూపిస్తున్నారు డైరెక్టర్స్. ఇక్కడే సక్సెస్ రేట్ ఎక్కువగా కనిపిస్తుంది. ఒకటి రెండు కాదు.. కరోనా తర్వాత రూటెడ్ కథలకు డిమాండ్ బాగా పెరిగింది.