బింబిసార 2 నుంచి దర్శకుడు అవుట్.. మరో దర్శకుడికి ఛాన్స్..

వశిష్ఠ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం బింబిసార.

ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ మగధ సామ్రాజీనేత బింబిసారుడిగా నటించి మెప్పించారు.

ఈ చిత్రంలో సంయుక్త మీనన్, కేథరిన్ హీరోయిన్స్ గా నటించారు.

సోషియో ఫాంటసీ చిత్రంగా రూపొందిన ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ ద్విపాత్రాభినయం చేశారు.

బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రానికి సీక్వెల్ గా బింబిసార 2  రానున్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటె ఈ సీక్వెల్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ చిత్రం నుంచి దర్శకుడు వశిష్ట్ తప్పుకుంటారని వార్తలు వస్తున్నాయి.

చిరుతో సినిమా చేసే ఛాన్స్  రావడంతో వశిష్ఠ ఈ చిత్రం నుంచి తప్పుకుంటున్నారని టాక్.

దాంతో ఈ చిత్రాన్ని మరో దర్శకుడి పెట్టనున్నారట నిర్మాత కళ్యాణ్ రామ్.

అయితే దీనిపై బింబిసారు టీం ఎలాంటి అధికారక ప్రకటన చేయలేదు.