అమితాబ్‌ ముందు బ్రాతో నటించనంది.. కట్ చేస్తే సినిమా నుంచి అవుట్!

09 September 2023

అప్పట్లోనే కాదు.. ఇప్పుడు కూడా బాలీవుడ్‌ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ ఎవరంటే ఎవ్వరైనా ముందు చెప్పే పేరు మాధురి దీక్షిత్.

తన అందంతో అందర్నీ మెస్మరైజ్ చేసిన ఈ బ్యూటీ.. నాటి నుంచి నేటి వరకు బాలీవుడ్‌లో బ్యూటీ క్వీణ్ గానే కొనసాగుతున్నారు.

అలాంటి ఈస్టార్ హీరోయిన్ ఓ సారి అమితాబ్ బచ్చన్ సినిమా షూట్‌ నుంచి మధ్యలో వెళ్లిపోయారు. అది కూడా బ్రా సీన్‌ కారణంగా..!

అప్పట్లో అమితాబ్ , మాధురి కాంబోలో 'శనక్త్‌ ' సినిమాను తెరకెక్కించాలని అనుకున్నారు డైరెక్టర్ కమ్ యాక్టర్ టీనూ ఆనంద్‌.

అమితాబ్ మాధురి కాంబోలో ఫస్ట్ సినిమా కావడంతో.. ఈ సినిమాపై అందరి ఫోకస్ పడింది. క్రేజీ ప్రాజెక్ట్ గా ట్యాగ్ వచ్చింది.

ఇక ఈ సినిమా షూట్ స్టార్ట్ చేసిన డైరెక్టర్ టీనూ ఆనంద్... ఓ సీన్లో అమితాబ్‌ ముందు.. లోదుస్తుల్లో విప్పి నటించాలని మాధురికి చెప్పారు.

అయితే ఇది నచ్చని మాధురి దీక్షిత్.. అలాంటి సీన్ చేయనంటూ.. అమితాబ్‌ ముందే మొండికేసి కూర్చున్నారట.దీంతో డైరెక్టర్ టీనూ ఆనంద్.. మాధురిపై సీరియస్ అయి షూటింగ్ నుంచి వెళ్లిపో అని కేకలేశారట.

మాధురి కూడా కోపంతో షూటింగ్ నుంచి వెళ్లిపోయారట. దీంతో ఆ క్రేజీ సినిమా అర్థాంతరంగా ఆగిపోయిందట.ఇక ఇదే విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు డైరెక్టర్ టీను ఆనంద్.