సుకుమార్‌తో విజయ్ దేవరకొండ సినిమా.. ఏమైంది అసలు.?

Anil Kumar

23 May 2024

విజయ్ దేవరకొండ, సుకుమార్ కాంబినేషన్‌లో మూడేళ్ళ క్రితం ఓ సినిమా ప్రకటించారు నిర్మాత కేదార్ సెలగంశెట్టి.

ఆ తరువాత ఏమైందో తెలియదు కానీ.. అప్పటి నుండి.. ఇప్పటి వరకు ఆ ప్రాజెక్ట్ గురించి అసలు ఎలాంటి ఊసే లేదు.

2021 లో పుష్పతో మొదలైన సుకుమార్, బన్నీ ప్రయాణం అప్పటికి , ఇప్పటికి ఆ సినిమాతో బిజీ బిజీగా నడుస్తుంది.

ఇంక ఇతర ప్రాజెక్ట్స్‌తో విజయ్ దేవరకొండ కూడా బిజీ కావడంతో ఈ సినిమా గురించి ఇండస్ట్రీ లో సైతం మాట్లాడలేదు.

కానీ మూడు సంవత్సరాల తరువాత.. తాజాగా ప్రొడ్యూసర్ కేదార్ మాట్లాడుతూ.. విజయ్, సుక్కు సినిమా ఉందని తెలిపారు.

త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు తెలియజేస్తామని.. తప్పకుండ అప్డేట్ ఇస్తామని తెలిపారు కేదార్.

ఇదిలా ఉంటె సుక్కు కి పుష్ప 2 తరువాత పుష్ప3 కూడా ఉందనే వార్తలు ఇండస్ట్రీలో గట్టిగానే వినిపిస్తున్నాయి.

ఇక చూడాలి మరి.. విజయ్ , సుకుమార్ మూవీ ఎప్పుడు మొదలవుతుందో.. దీనిపై విజయ్ ఫ్యాన్స్ కూడా ఎదురుచూస్తున్నారు.