TV9 Telugu

30 January 2024

సుకుమార్ ఇంటి నుండి హీరోయిన్.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్

సినిమా స్టార్లు, సెలబ్రిటీలు ఎప్పుడూ హాట్ టాపిక్కే! అందుకే నెటిజన్లు ఎక్కువగా ఇదే పని చేస్తుంటారు.

ఇక తాజాగా  సుకుమార్ కూతురి ఫోటోలను నెట్టింట వైరల్ అయ్యేలా చేస్తున్నారు.

డైరెక్టర్‌ ఇంట అప్‌కమింగ్ హీరోయిన్ అంటూ.. ట్యాగ్ ఇస్తున్నారు.

ఇక సుకుమార్‌ ఫ్యామిలీ విషయానికి వస్తే.. సుకుమార్ వైఫ్‌ నేమ్ తబిత హంసిని.

చాలా కాలం ప్రేమించుకున్న తర్వాత 2009లో వివాహం చేసుకున్నారు. వీరికి సుకృతి, సుక్రాంత్ అనే పిల్లలు ఉన్నారు.

అయితే ఈ ఇద్దరిలో సుక్కు డాటర్ సుకృతి సోషల్ మీడియాలో తాజాగా ట్రెండ్ అవుతోంది.

పుష్ఫ ప్రీ రిలీజ్ ఈవెంట్లో.. తన తండ్రి తరుపున మాట్లాడిన సుకృతి అప్పటి నుంచి సెలబ్రిటీ అయిపోయారు.

తన టీనేజ్‌ లుక్స్‌తో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. టాలీవుడ్‌ అప్‌కమింగ్ హీరోయిన్ అనే ట్యాగ్ వచ్చేలా చేసుకుంటున్నారు.