మెగా ఫాన్స్ కు గుడ్ న్యూస్.. గేమ్ చేంజర్ వచేస్తున్నాడు

Anil Kumar

14 July 2024

రామ్ చరణ్ సరికొత్త మేకోవర్ లో గేమ్‌ చేంజర్‌ సినిమా పక్కా మాస్‌ సినిమా అని అన్నారు డైరక్టర్‌ శంకర్‌..

తమిళ్ డైరెక్టర్ కార్తిక్‌ సుబ్బరాజ్‌ నుంచి లైన్‌ తీసుకుని పూర్తిగా తెలుగు ఆడియన్స్ ని మెప్పించే విధంగా.,

స్ట్రైట్‌ సినిమాగా తెరకెక్కించాం.. చరణ్ నటన మెప్పిస్తుంది అంటూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు శంకర్.

గేమ్‌ చేంజర్‌ సినిమా విషయంలో నేను, ఆ మూవీ టీమ్‌ అంతా చాల కాన్పిడెంట్‌గా ఉందని చెప్పుకొచ్చారు డైరెక్టర్.

నిన్న మొన్నటి వరకు గేమ్ చేంజర్ విషయంలో నిర్మాతల నుంచి యాక్టర్ల వరకు అందరూ సైలెంట్ మోడ్‌లోనే ఉన్నారు.

ఆ టీం లో ఎవర్నీ ఏం అడిగిన అన్ని డైరెక్టర్‌కే తెలుసంటూ దాటేశారు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా సీన్ మారింది.

డైరెక్టర్ నే స్వయంగా అప్డేట్ ఇవ్వడంపై మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. సినీ లవర్స్ కూడా హ్యాపీ నే..

ఇక త్వరలోనే రిలీజ్ డేట్‌ విషయంలో కూడా క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అభిమానులు.