డైరెక్టర్ శంకర్‌కి కమల్‌ నుంచి ఖరీదైన బహుమతి..

‘భారతీయుడు’ చిత్రం భారీ విజయంతో ఇండస్ట్రీలో హిట్‌ కాంబోగా నిలిచారు కమల్‌ హాసన్‌, దర్శకుడు శంకర్‌.

ఇప్పుడు వీరిద్దరి కలయికలో వస్తున్న మరో చిత్రం ‘భారతీయుడు 2’.

‘భారతీయుడు’ చిత్రానికి సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

ఈ చిత్రంలో కమల్‌కి జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది.

ప్రస్తుతం చివర దశలో ఉన్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ చిత్రంపై చిత్రప్రియుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

ఇదిలా ఉండే చిత్ర దర్శకుడు శంకర్‌కి ఖరీదైన వాచ్‌ను బహుకరించారు కమల్‌.

శంకర్ ఈ విషయాన్ని ట్విటర్‌ ద్వారా ఓ ఫోటోను షేర్ చేస్తూ అభిమానులతో పంచుకున్నారు.