TV9 Telugu

అర్జున్ రెడ్డి నటుడిపై సందీప్ రెడ్డి వంగా ఓ రేంజ్ లో సీరియస్.

22 April 2024

తన సినిమాలపై ఎవరైన చిన్న కామెంట్ చేసినా.. చాలా పెద్దగా రియాక్టయ్యే డైరెక్టర్స్ లో సందీప్ రెడ్డి వంగా ఒకరు.

తనమీద కానీ , తన సినిమాల మీద కానీ., తన స్కిల్స్ మీద కానీ చిన్న విమర్శ చేసిన ఘాటైగా సమాధానం ఇస్తారు వంగా.

తాజాగా ఇలాంటి పరిణామమే మరొకటి జరిగింది. ఈసారి ఇంకాస్త పెద్దగా, సీరియస్ గా రియాక్టయ్యాడు మిస్టర్ వంగా.

అర్జున్ రెడ్డి రిమేక్ కబీర్ సింగ్ మూవీలో లెక్చరర్ గా నటించిన అదిల్ హుస్సేన్‌.. కబీర్ సింగ్ లో నటించినందుకు..

ఎందుకు నటించానా అని  ఫీలవుతున్నట్టు ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఈ కామెంట్స్ వైరల్ అయ్యాయి. దీనిపై రియాక్టైన వంగా..

అదిల్ పై ట్విట్టర్ లో విరుచుకుపడ్డాడు. మీరు నటించిన 30 సినిమాలతో రాని గుర్తింపు.. ఈ బ్లాక్ బస్టర్ సినిమాతో వచ్చింది.

దురాశ ఎక్కువగా ఉన్న మిమ్మల్ని.. నా సినిమాలో తీసుకున్నందుకు బాధ పడుతున్నా'..  అంటూ ట్వీట్ చేశారు వంగా.

ఇకపై మీరు సిగ్గుపడకుండా ఆ మూవీలోని మీ పేస్ ని AIతో మార్చేస్తా అంటూ మరో ట్వీట్ చేశాడు సందీప్ రెడ్డి వంగా.!