బేబీ సినిమా మొదట ఆ హీరోని అనుకున్నారట..
18 September 2023
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జోడిగా నటించిన చిత్రం బేబీ. ఇటీవల వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
సాయి రాజేష్ నీలం తెరకెక్కించిన ఈ చిత్రాన్ని శ్రీనివాస కుమార్ నాయుడు (ఎస్ కే ఎన్) మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించారు.
బేబీ చిత్రంలో విరాజ్ అశ్విన్, నాగ బాబు, వైవ హర్ష, లిరీషా కునపరెడ్డి వంటి వారు కీలక పాత్రల్లో నటించారు.
కొన్ని వాస్తవ సంఘటనలను ఆధారంగా రూపొందిన ఈ చిత్రనికి యూత్ బాగా కనెక్ట్ అవడంతో పాజిటివ్ టాక్ తో దూసుకుపాయింది,
అయితే బేబీ చిత్రంలో హీరోగా ఆనంద్ కి బదులుగా మొదట ఓ క్రేజీ యంగ్ హీరోని అనుకున్నారు దర్శకుడు సాయి రాజేష్ నీలం.
అయితే కారణం ఏంటో తెలియదు కానీ సినిమా కథ వినకుండానే ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేసారంట ఆ క్రేజ్టీ యంగ్ హీరో.
ఇంతకీ ఆ హీరో ఎవరు అనుకొంటున్నారా.. ఎవరో కాదు ఇటీవల కలంలో విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో విశ్వక్ సేన్.
ఇటీవల ఆహా వేదికగా ఓటీటీలో విడుదల అయింది బేబీ మూవీ. ఓటీటీలో కూడా భారీ వ్యూస్ తో దూసుకుపోతుంది ఈ చిత్రం.
ఇక్కడ క్లిక్ చెయ్యండి