25 January 2024
అందగత్తెను చూసి.. కన్నీళ్లు పెట్ట
ుకున్న ఆర్జీవీ
TV9 Telugu
ఉన్నదున్నట్టు... మనసుకు ఏది అనిపిస్తే అది చెప్పేస్తూ ఉంటారు ఆర్జీవీ.
అది కాంట్రవర్సీయే కానీ.. తనను కదిలించిన విషయమే కానీ.. మొహమాటానికి పో
కుండా... సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌కు పంచుకుంటూ ఉంటారు.
ఈ సారి కూడా అదే చేశారు. ఒక అందగత్తె ఫోటో.. తన కళ్లలో నుంచి నీళ్లు వచ్చేలా చేసిందంటూ తన ఇన్‌స్టా పోస్ట్‌లో రాసుకొచ్చారు.
టాలీవుడ్ సెన్సెషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.. శ్రీదేవికి వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే.
ఆమెను ఎంతగా ఆరాధించాడో అనేకసార్లు చెప్పాడు. ఇక శ్రీదేవితో కలిసి రెండు సినిమాలు తెరకెక్కించాడ
ు.
దివంగత హీరోయిన్ శ్రీదేవి ఏఐ ఫోటో కూడా నెట్టింట తిరిగేస్తూ అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ఇక ఫోటో ఆర్జీవీకి తారసపడింది. అంతే.. ఆ ఫోటోను తన ఇన్ స్టాలో షేర్ చేస్తూ.. శ్రీదేవి నన్ను ఏడి
పించిందంటూ ఎమోషనల్ అయ్యారు ఆర్జీవీ.
ఇక్కడ క్లిక్ చేయండి