జక్కన్న నెక్స్ట్ సినిమా ఆ గ్లోబల్ స్టార్స్ తోనే

సాధారణంగా జక్కన్న సినిమా తీస్తున్నడంటేనే రెండు మూడేళ్ల ముందు నుంచే గాసిప్స్ మొదలవుతాయి

షూటింగ్ కి రెండేళ్ల టైం, ఇంకా టెక్నికల్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కలుపుకుని మరో ఏడాది చేసినా చేస్తారు.

అయితే.. ఎంత లేట్ అయినా జక్కన్న ఎంట్రీ మాత్రం లేటెస్ట్ గా ఉంటుంది.

ఆయన సినిమా ఎంత లేటయినా దానిపై బజ్ వేరే లెవల్లో ఉంటుంది.

దీంతో జక్కన్నసినిమాల కోసం టాలీవుడ్ మాత్రమే కాదు.. బాలీవుడ్ సైతం ప్రస్తుతం ఆతృతగా ఎదురు చూస్తుంది.

ఆర్ఆర్ఆర్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్నట్లు జక్కన్నఎప్పుడో ప్రకటించారు.

ఇదిలా ఉంటే.. మహేష్ బాబుతో చేసే సినిమా తర్వాత జక్కన్న ఎవరితో సినిమా చేయనన్నాడు అనేది ఆసక్తిగా మారింది.

ఈ సినిమా తరువాత జక్కన్న తనకు దగ్గరైన ప్రభాస్, ఎన్టీఆర్ లతో కలిసి ఓ మల్టి స్టారర్ సినిమా తీయబోతున్నారని తెలుస్తోంది.

ఇప్పటికే జక్కన్న ఈ సినిమా గురించి ఓ లైన్ కూడా అనుకున్నారట.

దాంతో అభిమానులు కూడా ఈ సినిమా గురించిన అప్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు.