TV9 Telugu
ఎలా మెప్పిస్తారు జక్కన్నా?
06 March 2024
సినిమాకు ప్రీ ప్రొడక్షన్ చేయడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. దీని కోసం ఎన్నెన్నో కసరత్తులు చేయాల్సి ఉంటుంది.
ఇప్పుడు రాజమౌళి - మహేష్ సినిమా ప్రీ ప్రొడక్షన్ గురించి వార్తలు చూస్తున్నవారికి ఆ విషయం ఇంకాస్త క్లారిటీగా అర్థమవుతోంది.
ఈ సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు లుక్ కోసం దర్శకుడు రాజమౌళి ఇప్పటికే ఎనిమిది స్కెచ్‌లు రెడీ చేయించారట.
ఇప్పటివరకు స్క్రీన్ మీద ఎప్పుడు కనిపించని లుక్‌లో హీరో మహేష్‌ని ఈ చిత్రంలో చూపించాలన్నది జక్కన్న ప్లాన్.
టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు కూడా జక్కన్నతో చేయబోయే సినిమా కోసం చిక్కటి గడ్డం, పొడవాటి జుట్టు పెంచారు.
ఆయనకు సరిపోయే లుక్ టెస్ట్ త్వరలోనే చేయనున్నారు జక్కన్న. వీటిలో ఏది సెట్ అయితే దాన్ని ఫైనల్ చేస్తారట.
ఈ ప్రాజెక్ట్ కోసం తాను కూడా ఎగ్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నానని అన్నారు తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు.
ఇండియన్ స్క్రీన్ మీద ఇంతకు ముందు ఎప్పుడూ ఎవరూ చూడని విజువల్స్ ఈ సినిమాలో ఉంటాయని ఆల్రెడీ ఊరిస్తూనే ఉన్నారు స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్.
ఇక్కడ క్లిక్ చెయ్యండి