TV9 Telugu

20 January 2024

డార్లింగ్ ఫ్యాన్స్ ఎఫెక్ట్.! ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రశాంత్ నీల్.

సలార్‌తో ప్రశాంత్ నీల్‌కు అసలు ఇబ్బందులు మొదలయ్యాయా..?

సలార్ సక్సెస్‌తో చాలా ఏళ్ళ తర్వాత ప్రభాస్ ఫామ్‌లోకి వచ్చారేమో కానీ..

పాపం ప్రశాంత్ నీల్‌కు మాత్రం కావాల్సినంత కన్ఫ్యూజన్ వచ్చింది ఈ విజయంతో..

అనుకున్నట్లుగానే పార్ట్ 1 విడుదలవ్వడం, 650 కోట్ల వసూలు చేయడంతో అంతా హ్యాపీగా ఉన్నారు.

ఈ వేడిలో ఉన్నపుడే సలార్ 2 పార్ట్ చేయాలా లేదంటే..

ముందుగా కమిటైన జూ.ఎన్టీఆర్ సినిమా చేయాలా అనే కన్ఫ్యూజన్‌లో ఉన్నారు ప్రశాంత్ నీల్.

సలార్ 2 పార్ట్స్ మధ్య ఇన్ని సినిమాలు వస్తే.. ఫలితంపై ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు.

బాహుబలి, కేజియఫ్, పుష్ప ఇవన్నీ వెంటవెంటనే వచ్చాయి. సలార్‌కు భారీ గ్యాప్ తీసుకుంటారా లేక ముందే పూర్తి చేస్తారా అనేది చూడాలి.