TV9 Telugu
28 February 2024
కల్కి 2898 AD టైటిల్ స్టోరీ చెప్పేసిన డైరెక్టర్ నాగ అశ్విన్.
వరల్డ్ వైడ్ మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తోన్న సినిమా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898 AD’ మూవీ.
డైరెక్టర్ నాగ్ అశ్విన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తోన్న ఈ సైన్స్ ఫిక్షన్ డ్రామాలో బాలీవుడ్ స్టార్స్ కూడా ఉన్నారు.
వైజయంతీ మూవీస్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమా గురించి రోజుకో న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
తాజాగా ఈ సినిమా డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఈ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేశాయి.
ఈ మూవీ మహాభారతంతో ప్రారంభమై 2898లో ముగుస్తుంది. మొత్తం 6000 ఏళ్ల మధ్య జరిగే కథను చూపిస్తుంది ఈ సినిమా.
ఇందులోని పాత్రలన్నీ ఇండియన్ మైథాలజీ చుట్టే ఉంటాయి. భవిష్యత్తు ప్రపంచం ఎలా ఉంటుందో చూపే ప్రయత్నం కూడా చేశాం.
అందుకే ఈ సినిమాకు కల్కి 2898 అని టైటిల్ పెట్టాం అంటూ టైటిల్ కు సంబంధించిన సీక్రెట్ ను సైతం వెల్లడించారు నాగి.
ఈ సినిమా చాలా సెట్లు, డిజైన్స్, వాహనాలను కొత్తగా నిర్మించడం వల్ల వీఎఫ్ఎక్స్ కోసం వెళ్లాల్సిన అవసరం లేదు అనిపించింది అన్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి