31 December 2023

కల్కి రిలీజ్‌పై హింట్‌ వచ్చిందోచ్‌!

TV9 Telugu

ఈ ఏడాది రెబల్ స్టార్ ప్రభాస్ స్టామినా ఏంటో బాక్సాఫీస్ కు మరోసారి రుచి చూపించాడు.

వరుస ఫ్లాప్ లతో సతమతం అయిన ప్రభాస్ సలార్ సినిమాతో భారీ విజయాన్ని అందుకొని ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇచ్చాడు.

నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో కల్కి 2898ఎడి అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా పై కూడా భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. 

తాజాగా కల్కి 2898ఎడి సినిమా ట్రైలర్ గురించి దర్శకుడు నాగ అశ్విన్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చాడు.

తాజాగా దర్శకుడు నాగ అశ్విన్ ముంబై లోని ఓ టెక్ ఈవెంట్ లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ. కల్కి 2898ఎడి సినిమా విషయాలను పంచుకున్నారు ట్రైలర్ గురించి హింట్ ఇచ్చారు.

కల్కి 2898ఎడి ట్రైలర్ ను మరో 93 రోజుల్లో విడుదల చేయనున్నాం అని తెలిపాడు. ఇక సినిమాను ఏప్రిల్ 1న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.