కల్కి 2898 AD సీక్వెల్ ఉందా.? అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన నాగి..

Anil Kumar

21 June 2024

ఓ సినిమాపై ఉన్న ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్‌ను తప్పించుకోడానికి.. ఇండస్ట్రీ లో కొత్త స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు.

ఇప్పుడు టాలీవుడ్ డైరెక్టర్స్ ఫాలో అవుతునం ట్రెండ్ ఇదే.. రిలీజ్‌కు ముందే మా స్టోరీ ఇదని చెబుతున్నారు.

అప్పుడెప్పుడో మగధీర తర్వాత మర్యాద రామన్నతో ఈ స్టాటజీని మొదలెట్టిన జక్కన్నను.. ఇప్పుడు అందరూ ఫాలో అవుతున్నారు.

ఇక తాజాగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కల్కి మూవీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కూడా ఇప్పుడు ఇదే చేశారు.

కల్కి మూవీలో త్రీ వరల్డ్స్‌ ఉంటాయని.. కాశీ, కాంప్లెక్స్‌, శంబాలా..  ఈ మూవీ వరల్డ్స్‌ లో ఉన్న ప్రజలు..

హెవెన్‌లా ఉన్న ఉన్న కాంప్లెక్స్‌ కోసం చేసే పోరాటం ఈ సినిమా అంటూ కల్కి స్టోరీ లైన్‌ ను లీక్ చేసేసాడు. 

దానితో పాటే కల్కి 2898 ఏడీ సీక్వెల్ విషయంలో కూడా అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు డైరెక్టర్ నాగ్ అశ్విన్‌.

సీక్వెల్‌ ఉంటుందా అంటే.. సంబంధం లేని సమాధానం ఇచ్చారు. దీంతో సీక్వెల్ విషయంలో డైలమాలో పడిపోయారు ఫ్యాన్స్.