24 October 2023

డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ప్లాన్ మార్చనున్నాడా..?

విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ లియో.

దసర కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు డివైడ్‌ టాక్ వచ్చినా వసూళ్ల పరంగా రికార్డ్‌లు క్రియేట్ చేస్తోంది.

తాజాగా ఈ సినిమాను ఎల్‌సీయూలో భాగం చేస్తూ లోకి యూనివర్స్‌ టైమ్‌ లైన్‌ను డీకోడ్ చేస్తున్నారు ఫ్యాన్స్‌.

ఖైదీ, విక్రమ్‌, లియో సినిమాల్లోని క్యారెక్టర్స్‌ను కనెక్ట్  చేస్తూ వాటి టైమ్ లైన్స్‌ను డీకోడ్ చేశారు.

కథ ప్రకారం ఖైదీ సినిమా 2019లో జరుగుతుంది. అంతకు ముందు పదేళ్ల పాటు ఢిల్లీ జైల్లో ఉన్నాడు.

అంటే 2009కి ముందు ఢిల్లీ జీవితంలో జరిగిన సంఘటన నేపథ్యంలోనే ఖైదీ 2ను ప్లాన్ చేస్తున్నారన్న టాక్ ఉంది.

విక్రమ్‌ కథ కూడా ఖైదీ కథకు ప్యారలల్‌గా జరుగుతున్నట్టుగానే చూపించారు. అంటే 2019లో టైమ్‌లోనే ఉంటుంది.

ఆ సినిమా క్లైమాక్స్‌లో రోలెక్స్ ఎంట్రీ ఇచ్చారు  కాబట్టి, రోలెక్స్‌ కథ కూడా ఢిల్లీ, విక్రమ్‌ క్యారెక్టర్‌లకు ప్యారలల్‌గానే ట్రావెల్‌ చేస్తుంది.

లియో 2021లో జరగుతుంది. ఈ సినిమా క్లైమాక్స్‌లో ఆంటోని దాస్‌, హెరాల్డ్ దాస్‌ చనిపోవటంతో లియో కథ ముగుస్తుంది.

కానీ ఇప్పుడు ఈ కథను ఎల్‌సీయూకి కనెక్ట్ చేస్తూ రోలెక్స్‌ క్యారెక్టర్‌ హెరాల్డ్ దాస్‌కు కొడుకు అన్న ప్రచారం మొదలు పెట్టారు.