తగ్గేదేలే.. దుబాయ్‌కి పుష్పరాజ్.. ఎందుకంటారా..

23 September 2023

పవన్‌ కల్యాణ్‌ ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ని చుట్టేస్తున్నారా? ట్విట్టర్‌ వేదికగా జరిగిన ఓ డిస్కషన్‌తో... ఇన్‌స్టంట్‌గా వైరల్‌ అయింది ఈ న్యూస్‌..!

ఇంతకీ డిస్కషన్‌ ఎవరు మొదలుపెట్టారు? ఎవరు కంటిన్యూ చేశారు? మధ్యలో దేవుడి మీద భారం వేసిందెవరు? ఈ డిస్కషన్‌తో పవన్‌ అదర్‌ ప్రాజెక్టుల మీద ఒక్కసారిగా ఫోకస్‌ పెరిగింది.

మేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌తో కలిసి పవర్‌స్టార్‌ నటించిన సినిమా బ్రో. పవర్‌స్టార్‌ టైమ్‌ కేరక్టర్‌లో చేసిన ఈ సినిమా తెలుగు ఆడియన్స్ ని మెస్మరైజ్‌ చేయడంలో ఎక్కడో తడబడింది.

ఈ మూవీ తర్వాత ఆయన ఓజీ మీద కాన్‌సెన్‌ట్రేట్‌ చేస్తున్నారు. పవన్‌కల్యాణ్‌ ఫేవరేట్‌ సబ్జెక్ట్ మార్షల్‌ ఆర్ట్స్ కి ఇంపార్టెన్స్ ఉంది ఓజీలో. చకచకా షూటింగ్‌ కూడా కంప్లీట్ చేసుకుంటోంది ఓజీ.

ఓజీ కీ షెడ్యూల్‌ కంప్లీట్‌ కాగానే ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ సెట్‌కి షిఫ్ట్ అయ్యారు పవర్‌స్టార్‌. ఈ సినిమా ప్రోగ్రెస్‌ మీదే ట్విట్టర్‌లో ఇంట్రస్టింగ్‌ డిస్కషన్‌ కనిపించింది.

''ఉస్తాద్‌ సినిమా షూటింగ్‌ అప్పుడే 50 శాతం పూర్తయిందంట కదన్నా.. ఇక క్వాలిటీ ఆ దేవుడి మీదే భారం వేశాం'' అంటూ ఓ ఫ్యాన్‌ పెట్టిన పోస్టుకు తనదైన స్టైల్‌లో ఆన్సర్‌ ఇచ్చారు డైరక్టర్‌ హరీష్‌ శంకర్‌.

''అంతే కదా తమ్ముడు. అంతకు మించి నువ్వేమి చేయగలవు చెప్పు... ఈ లోకా కాస్త కెరీర్‌, జాబ్‌ స్టడీస్‌ మీద ఫోకస్‌ పెట్టు.. వాటిని మాత్రం దేవుడికి వదిలేయకు.. ఆల్‌ ది బెస్ట్'' అంటూ రిప్లై ఇచ్చారు.

తనకున్న టైమ్‌ లిమిట్‌లో స్పీడ్‌గా ప్రాజెక్టులు కంప్లీట్‌ చేస్తున్నారు పవన్‌ కల్యాణ్‌. ఎలక్షన్‌ క్యాంపెయిన్‌ మొదలయ్యేలోపు వీలైనంత షూట్‌ కంప్లీట్‌ చేసేయాలనే పట్టుదలతో ఉన్నారు.

ఆయన కాల్షీట్‌కి తగ్గట్టు, ఆయన పోర్షన్‌ని కంప్లీట్‌ చేసేలా ముందు ప్లాన్‌ చేసుకుంటున్నారు కెప్టెన్లు. దీంతో చకచకా ఫినిష్‌ అవుతున్న పవన్‌ పోర్షన్‌ గురించి డిస్కషన్‌ మొదలవుతోందన్నది క్రిటిక్స్ మాట.