రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదేలే అంటున్న అట్లీ

TV9 Telugu

14 March 2024

ఒకప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్. కానీ ఇప్పుడు ఇండియాలోని టాప్ డైరెక్టర్లలో అతడు ఒకరు.

తొలి సినిమాతోనే యూత్‏ను కట్టిపడేశాడు. ఇప్పుడేమో ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న దర్శకుడిగా నిలిచాడు. అతడే డైరెక్టర్ అట్లీ.

తమిళంలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అట్లీ జవాన్ సక్సెస్ తో పాన్ ఇండియా రేంజ్‌కు ఎదిగాడు.

బాక్సాఫీస్ దగ్గర 1000 కోట్ల దాటిన ఈ సినిమాతో.. డైరెక్టర్‌గా తన ట్యాలెంట్ ఏంటో అందరికీ చూపించేశాడు...

అతడు నెక్ట్స్ ఏ హీరోతో సినిమా చేయబోతున్నాడనే క్యూరియాసిటి నెలకొంది. అయితే అట్లీ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ తో చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది.

అంతేకాదు ఈ సినిమా కోసం భారీగా రెమ్యునరేషన్ కూడా తీసుకోనున్నట్టు.. ఓ న్యూస్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

అల్లు అర్జున్ సినిమాకు డైరెక్టర్ అట్లీ 60 కోట్లు రెమ్యునరేషన్ తీసుకోనున్నాడని సమాచారం.  ఈ సమాచారం నిజమేనా? లేక రూమరా అనేది తెలియాల్సి ఉంది.