దిల్ రాజు సీరియస్.. ఓజీపై నటుడు వెంకట్ కామెంట్స్ వైరల్..
TV9 Telugu
09 January 2024
తనపై తప్పుడు వార్తలు రాస్తున్న వెబ్ సైట్లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు నిర్మాత దిల్ రాజు. చిన్న సినిమాలనేవి ప్రతి సంక్రాంతికి సినిమాలు విడుదలవుతుంటాయి.
అయితే ఏదో ఒక రకంగా తనపై ప్రతీ సంక్రాంతికి కొందరు విమర్శలు చేస్తున్నారంటూ చెప్పుకొచ్చారు నిర్మాత దిల్ రాజు.
చిరంజీవి తనపై చేసిన కామెంట్స్‌ను వక్రీకరించి రెండు వెబ్ సైట్లు రాసాయని.. వాళ్లకు వార్నింగ్ ఇస్తున్నట్లు చెప్పారు ఈ నిర్మాత.
పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా ఓజీ. ఈ సినిమా గురించి నటుడు వెంకట్ చెప్పిన మాటలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.
ఓజీ సినిమా కోసం దర్శకుడు సుజీత్ సృష్టిస్తున్న వరల్డ్ ఇంకో రేంజ్‌లో ఉంటుందని అన్నారు సినీ నటుడు వెంకట్.
రెండు దశాబ్దాలకు పైగా తనకు పవన్ కల్యాణ్‌తో పరిచయం ఉందని, ఓజీలో ఆయనతో కలిసి నటించడం ఆనందంగా ఉందని తెలిపారు.
శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న సినిమా అయలాన్. ఏలియన్ ఇండియాకు వస్తే అనే కథాంశంతో కామెడీ, మెసేజ్ ఓరియెంటెడ్‌గా ఈ సినిమా వస్తుంది.
సంక్రాంతి పండగ సందర్భంగా ఈ శుక్రవారం (జనవరి 12)న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది ఈ అయలాన్ సినిమా.
తాజాగా ఈ చిత్రం నుంచి సురో సురో అంటూ సాగే లిరికల్ సాంగ్ విడుదలైంది. రవికుమార్ ఈ చిత్రానికి దర్శకుడు కాగా.. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి