యాంకర్‌గా దిల్ రాజు.. నాగ శౌర్య చేతుల మీదుగా..

TV9 Telugu

07 April 2024

ఫ్యామిలీ స్టార్ సినిమా కోసం దిల్ రాజు చాలా కష్టపడుతున్నారు. మొన్నటికి మొన్న మీడియా ఫ్యామిలీస్‌తో స్పెషల్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసారు.

ఇప్పుడు థియేటర్స్ దగ్గర మైక్ పట్టుకుని.. స్వయంగా నిర్మాత దిల్ రాజు సినిమాపై అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు.

ఫ్యామిలీ స్టార్ సినిమా తెలుగు కుటుంబాలకు చేరువ అవుతుందని తెలిపారు టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు.

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా సాయి మోహన్ ఉబ్బాన తెరకెక్కిస్తున్న సినిమా శశివదనే. ఏప్రిల్ 19న విడుదల కానుంది ఈ చిత్రం.

తాజాగా ఈ సినిమా నైజాం రైట్స్‌ను మైత్రి మూవీ మేకర్స్ తీసుకున్నారు. తెలంగాణలో భారీ స్థాయిలో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.

హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్‌లో ఆల్ ఇండియా పురుషుల టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 6 నుంచి 20 వరకు ఈ టోర్నీ జరుగుతుంది.

FNCC ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్, తెలంగాణ స్టేట్ టెన్నిస్ అసోసియేషన్ సహకారంతో ఈ టోర్నీ జరుపుతున్నారు.

FNCC ఓ ప్రతిష్ఠాత్మక టెన్నిస్ టోర్నీ నిర్వహించడం ఇదే మొదటిసారి. ఈ టోర్నీ ప్రారంభోత్సవానికి నాగ శౌర్య వచ్చారు.