02 December 2023

సైలెంట్‌గా కార్యం కానిచ్చిన టాలీవుడ్ యంగ్ హీరో..

ఇది కార్తీక మాసం..! పైగా శుభకార్యాలకు మంచి ముహూర్తాలు ఉన్న మాసం!

అందుకే ఎక్కడ చూసినా.. శుభకార్యాలే శుభకార్యాలు. 

అయితే ఈ కార్యాలలోనే.. తన కార్యం కూడా చాలా సైలెంట్‌గా కానిచ్చేశాడు దిల్ రాజు కొడుకు ఆశిష్‌. 

తక్కువ మందికి తెలిసేలా.. చాలా గ్రాండ్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు.

ఏపీకి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త కూతురు.. అద్వైత రెడ్డి కలిసి త్వరలో ఏడడుగులు వేయనున్నాడు. 

అందుకోసం తాజాగా ఆమెతో నిశ్చితార్థం చేసుకున్నాడు.

అతి కొద్ది తన నియర్ అండ్ డియర్స్ మధ్యలో... ఈ కాబోయే వధూవరులిద్దరూ... ఉంగరాలు మార్చుకున్నారు.

ఈ వేడుకతో.. ఈ వేడుకలో దిగిన ఫోటోలతో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాడు ఈ హీరో.