ఫ్యామిలీస్టార్‌ కాన్సెప్ట్ అదేనా!

TV9 Telugu

24 March 2024

విజయ్‌ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా పరశురామ్ తెరకెక్కిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా ఫ్యామిలీస్టార్‌.

ఈ ఫ్యామిలీ సినిమా విడుదలకు సంబంధించి కౌంట్‌డౌన్‌ స్టార్ట్ అయింది. ఇది ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో ఫ్యామిలీ స్టార్ సినిమా కాన్సెప్ట్ గురించి రివీల్‌ చేశారు ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్‌రాజు.

తమ ఫ్యామిలీని సమాజంలో మంచి పొజిషన్‌లో నిలబెట్టడానికి కృషి చేసి, సక్సెస్‌ అయిన ప్రతి ఒక్కరూ ఫ్యామిలీ స్టార్సే అని అన్నారు దిల్‌రాజు.

తానుగానీ, సొసైటీలో మంచి స్థాయిలో ఉన్న ఎంతో మందిగానీ, పట్టుదల, కృషితో ముందుకువచ్చామని అన్నారు దిల్‌రాజు.

అలా తమ కుటుంబాలకు సమాజంలో ఓ గౌరవాన్ని తెచ్చిపెట్టి, నలుగురిలోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న వారందరూ ఫ్యామిలీస్టార్లేనని అన్నారు.

విజయ్‌ దేవరకొండ స్టార్‌ కాబట్టి, ఆయనకోసం ఫ్యామిలీస్టార్‌ అనే టైటిల్‌ పెట్టలేదని చెప్పారు. కథలో భాగంగానే పెట్టామని అన్నారు.

తమ ప్రొడక్షన్‌ హౌస్‌ నుంచి వస్తున్న ఈ ఫ్యామిలీ మూవీ, ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుందని చెప్పారు దిల్‌రాజు.