మళ్లీ చెప్పేశారు.. వచ్చేస్తున్నారు!

TV9 Telugu

16 March 2024

ఇంతకు ముందు సినిమాల గురించి ఏ విషయాన్నైనా ఒకసారి చెబితే సరిపోయేది. కానీ, ఇప్పుడు పరిస్థితి అలా లేదు.

మళ్లీ మళ్లీ మూవీ విషయం చెప్పాల్సి వస్తోంది. సినిమా రీ కన్ఫర్మేషన్‌కి వేల్యూ యాడ్‌ అవుతున్న రోజులివి.

తన సినిమాల గురించి అలాంటి విషయాలను గుర్తించడంలో స్పీడు మీదుంటారు టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్‌రాజు.

అందుకే ఆయన ఇప్పుడు మరోసారి తన నిర్మాణంలో వస్తున్న సినిమా డేట్‌ని మరోసారి కన్‌ఫార్మ్ చేశారు దిల్ రాజు.

విజయ్‌ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటించిన ఫ్యామిలీస్టార్‌ సినిమాను ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు ప్రకటించారు.

'వి వెల్కమ్‌ యు టు క్లియర్‌ ఆల్‌ యువర్‌ డౌట్స్ విత్‌ యువర్‌ ఫ్యామిలీ' అంటూ డేట్‌ని మరోసారి అనౌన్స్ చేసింది టీమ్‌.

ఆల్రెడీ ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ నుంచి విడుదలైన రెండు పాటలకు మంచి స్పందన వస్తోంది. పాటల పిక్చరైజేషన్‌ కూడా రిచ్‌గా ఉంది.

విజయ్‌ దేవరకొండకు కలిసొచ్చే జోనర్‌ కావడంతో, సినిమా మీద మరిన్ని హోప్స్ పెట్టుకుంటున్నారు రౌడీ ఫ్యాన్స్.