హమ్మయ్య.. గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ పై అప్డేట్ ఇచ్చిన దిల్ రాజ్ కూతురు.

Anil Kumar

31 May 2024

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ సినిమా గేమ్ ఛేంజర్.

ఎన్నో అంచనాల మధ్య నిర్మించబడుతున్న ఈ చిత్రం షూటింగ్ చివరిదశకు వచ్చింది అంటున్నారు గేమ్ ఛేంజర్ మేకర్స్.

ఇదిలా ఉంటె ఎప్పటినుండో ఈ సినిమా రిలీజ్ డేట్‌పై ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే..

ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం తాజాగా మరోసారి ఈ చిత్ర రిలీజ్ డేట్‌పై స్పష్టత వచ్చింది అంటున్నారు..

ఎప్పటి నుండో క్లారిటీ లేక.. మెగా అభిమానులు కాస్త నిరాశ పడుతున్న సమయంలో ఈ వార్త మరింత కిక్ ఇస్తుంది..

ఈ సినిమాను అక్టోబర్‌లో రిలీజ్ చేయనున్నట్లు ఈ సినిమా ప్రొడ్యూసర్ దిల్ రాజు కూతురు హన్షిత రెడ్డి తెలిపారు.

గేమ్ ఛేంజర్ కథ చాలా భిన్నంగా ఉంటుందని.. మునుపెన్నడూలేని విధంగా చూడబోతున్నారని తెలిపారు హన్షిత రెడ్డి.

చరణ్ ఫ్యాన్స్ ఓపికకు పరీక్ష పెడుతూ, కన్ఫూజన్ క్రియేట్ చేసిన ఈ సినిమా రిలీజ్ డేట్ చెప్పండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.