TV9 Telugu

03 January 2024

రామ్ చరణ్ గేమ్ చేంజర్‌ రిలీజ్ డేట్ అప్డేట్..

గేమ్ చేంజర్‌ రిలీజ్‌కు సంబంధించి షాకింగ్ అప్‌డేట్ ఇచ్చారు నిర్మాత దిల్‌రాజు.

దాదాపు రెండేళ్లుగా ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్న మెగా ఫ్యాన్స్ ఆశల మీద నీళ్లు చల్లేశారు.

ట్రిపులార్ లాంటి బిగ్ హిట్ తరువాత శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్‌ సినిమా చేస్తున్నారు మెగాపవర్ స్టార్‌ రామ్ చరణ్.

దాదాపు రెండేళ్లుగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమా ఇంకా ఆడియన్స్ ముందుకు రాలేదు.

దీంతో చరణ్ ఫ్యాన్స్‌ మెగా మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అందుకే శంకర్ మీద గుర్రుగా ఉన్నారు ఫ్యాన్స్‌.

తాజాగా ఈ సినిమా రిలీజ్‌ గురించి మాట్లాడిన నిర్మాత దిల్‌రాజు.. అభిమానులకు షాక్ ఇచ్చారు.

గేమ్ చేంజర్‌ 2024 సెప్టెంబర్‌లో రిలీజ్ అవుతుందన్నారు నిర్మాత. ఈ అప్‌డేట్‌తో మెగా ఫ్యాన్స్ డీలా పడిపోయారు.

ఇప్పటికే చరణ్ కెరీర్లో లాంగ్ గ్యాప్‌ వచ్చిందంటున్న ఫ్యాన్స్‌ మరో ఏడాది వెయిట్ చేయాలా అని ఫీల్ అవుతున్నారు.