వేసవి మనదే: దిల్ రాజు.. అందుకే వర్కవుట్‌ అయింది: శ్రుతి..

TV9 Telugu

02 April 2024

ఈ ఏడాది వేసవికాలం అంతా కూడా మనదేనని అంటున్నారు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ ప్రముఖ స్టార్ నిర్మాత దిల్‌రాజు.

ఆల్రెడీ సిద్దు జొన్నలగడ్డ, అనుమప పరమేశ్వరన్ జంటగా నటించిన టిల్లు స్క్వయర్‌ డిస్ట్రిబ్యూటర్‌గా హిట్‌ అందుకున్నానని అన్నారు.

ఏప్రిల్‌లో ఫ్యామిలీ స్టార్‌ విడుదలవుతుందని చెప్పారు. ఆ తర్వాత లవ్‌మీ థియేటర్లలోకి రానుందని తెలిపారు.

ఆర్య విడుదలై 20 ఏళ్లు అవుతున్నందున, మే 7న ఆర్య టీమ్‌ రీ యూనియన్‌ని ప్లాన్‌ చేయాలని అనుకుంటున్నట్టు చెప్పారు దిల్‌రాజు.

కోలీవుడ్ స్టార్ దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ నాకు మంచి స్నేహితుడు అని అన్నారు స్టార్ హీరోయిన్ శ్రుతిహాసన్‌.

అందుకే స్క్రీన్‌ మీద తమ కెమిస్ట్రీ వర్కవుట్‌ అయిందని చెప్పారు. శ్రుతి, లోకేష్‌ కలిసి 'ఇనిమేల్‌' అనే వీడియో సాంగ్‌ చేశారు.

జీవితకాలపు బంధాన్ని ఈ పాటలో చూపించడం చాలెంజింగ్‌గా అనిపించిందని అన్నారు స్టార్ కథానాయకి శ్రుతి హాసన్.

లోకేష్‌ కానగరాజ్ మంచి దర్శకుడు మాత్రమే కాదు, చాలా మంచి నటుడు కూడా అని ప్రశంసించారు బ్యూటీ శృతి హాసన్.