నాగ్‌కు ఆ టీమిండియా క్రికెటర్ క్లాస్‌మేట్ అని తెలుసా?
29 October 2025
Basha Shek
నాగార్జున నటించిన ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ మూవీ శివ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది. నవంబర్ 14న థియేటర్లలో రీ రిలీజ్ కానుంది.
ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు శివ సినిమాపై తమ అభిప్రాయాలు చెబుతూ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు.
మహేష్ బాబు, అల్లు అర్జున్, రాజమౌళి.. ఇలా స్టార్ హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు శివ సినిమా పట్ల తమ అభిప్రాయాలను వీడియోల రూపంలో పంచుకున్నారు.
అయితే ఇదే సందర్భంగా టీమిండియా స్టార్ క్రికెటర్ కూడా నాగార్జున శివ సినిమా అనుభవాలను గుర్తు చేసుకున్నాడు
నాగార్జునతో తన అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసుకున్నాడు. తామిద్దరం ఇంజినీరింగ్ క్లాస్ మేట్స్ అని ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు.
ఆ టీమిండియా స్టార్ క్రికెటర్ మరెవరో కాదు అభిమానులు చిక్కా అని ముద్దుగా పిలుచుకునే కృష్ణమాచారి శ్రీకాంత్.
నాగార్జున స్కూల్, కాలేజీ రోజులన్నీ చెన్నైలోనే గడిచాయి. అప్పుడు ఆయన, శ్రీకాంత్ ఇంజినీరింగ్‌లో క్లాస్‌మేట్స్ అట
కాలేజీలో చాలా కామ్‌గా, ఎక్కువ మాట్లాడకుండా, ఒద్దికగా ఉండే నాగ్ శివ సినిమాతో యాక్షన్ హీరోగా మారేసరికి తామంతా షాక్ అయ్యామన్నాడు చిక్కా
ఇక్కడ క్లిక్ చేయండి.