జాతీయ అవార్డు గెల్చుకున్న సుక్కూ కూతురు ఇప్పుడు ఎన్నో క్లాసు చదువుతుందో తెలుసా?

07 August 2025

Basha Shek

ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో సుకుమార్ కూతురు సుకృతి వేణి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంపికైంది

 గాంధీ తాత చెట్టు సినిమాలో తన అద్బుత నటనకు గాను సుకృతి వేణికి ఈ ప్రతిష్ఠాత్మకమైన పురస్కారం లభించింది.

మల్లాది పద్మావతి తెరకెక్కించిన ఈ సినిమాలో సుకృతి వేణితో పాటు  ఆనంద్‌ చక్రపాణి, రఘురామ్‌, భాను ప్రకాష్‌, నేహాల్‌ ఆనంద్‌ కుంకుమ, రాగ్‌ మయూర్‌ తదితరులు నటించారు.

కాగా మొదటి సినిమా అయినా అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది సుకుమార్ కూతురు సుకృతి.

అంతేకాదు గాంధీ తాత చెట్టు సినిమా కోసం గుండు కూడా చేయించుకుందీ స్టార్ కిడ్. ఇప్పుడీ కష్టానికి ప్రతిఫలంగానే జాతీయ అవార్డు రూపంలో సుకృతికి దక్కింది.

 కాగా సుకృతి వేణి ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతున్నట్లు సమాచారం. హైదరాబాద్ లోనే ఆమె చదువుకుంటున్నట్లు తెలుస్తోంది

డైరెక్టర్ సుకుమార్ – తబిత దంపతులకు ఇద్దరు సంతానం. కూతురి పేరు సుకృతి వేణి కాగా కుమారుడి పేరు సుక్రాంత్

వీరిలో సుకృతి తండ్రి సుకుమార్ అడుగు జాడల్లోనే పయనిస్తోంది. మొదటి సినిమాతోనే ఏకంగా జాతీయ అవార్డుకు ఎంపికైంది